అశేష పాఠకలోకం కోరిక మేరకు ఎమెస్కోబుక్సు ఇప్పుడు ఎమెస్కో బుక్స్ వెబ్‌సైట్ ద్వారా కూడా లభిస్తున్నాయి.    
స్వయం సిద్ధ

Swayamsidha

ఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి

Arikepoodi(Kowdoori)Kowshyalya Deviరూ. 80


- +   

Publisher:  Sahithi Prachuranalu


--

About This Book


”మీరు అడగకున్నా చెప్పాల్సిన బాధ్యత నాకున్నదని అనుకుంటున్నాను. నేను ఇంటినుంచి పారిపోయి వచ్చాను. ఇక ఎప్పుడూ తిరిగివెళ్ళనేమో…”

నీరజ మాటలని అతను బొమ్మలా కూర్చుని వినసాగాడు. కానీ అతనికప్పటికే వివాహమైందని తెలిశాక అతడి ఆదరణనీ, ఆప్యాయతనీ ఆమె భరించగలదా?

”సారీ, శ్రీనివాస్‌గారూ! ఈ అతిచనువులు నాకిష్టంలేదు.” అని నిష్కర్షగా చెప్పేసింది.

అయినా అతను నీడలా ఆమెని వెన్నాడుతూనే ఉన్నాడు. ఆమె అతన్ని అసహ్యించుకుంటూనే అతన్ని ఆరాధిస్తోంది. ద్వేషిస్తూనే చేరువవుతుంది.

ఆడది అబలకాదనీ, తనకాళ్ళమీద తాను నిలబడగల ‘స్వయంసిద్ధ’ అని చాటిచెప్పాలని ఆమె ప్రయత్నం. అతను దానికి అడుగడుగునా అడ్డుతగులుతున్నాడు. కవ్వించి రెచ్చగొడుతున్నాడు.

ఏమిటతని ఉద్దేశ్యం? ఎలా నెరవేరిందామె లక్ష్యం?

సుప్రసిద్ధ రచయిత్రి ఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి

స్త్రీ జాతి స్వేచ్ఛా స్వాతంత్య్రాలకై

తొలిసారిగా సల్పిన సాహితీ పోరాటం – స్వయం సిద్ధ.

Books By This Author

Book Details


Titleస్వయం సిద్ధ
Writerఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి
Categoryభాషాసాహిత్యాలు
Stock 100
ISBN
Book IdSPI038
Pages 272
Release Date01-Mar-2014

© 2014 Emescobooks.Allrights reserved
37608
8389