భాగ్యచక్రం

Bhgyachakram

ఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి

Arikepoodi(Kowdoori)Kowshyalya Deviరూ. 100


- +   

Publisher:  Sahithi Prachuranalu


--

About This Book


”నాకు కట్నంయిచ్చి వివాహం చేయ నిశ్చయించారా నాన్నా? అది నా ఆదర్శానికి వ్యతిరేకమని తెలిసీ, ఎందుకీ పనిచేశారు? పైగా అది నా నుండి రహస్యంగా దాచిపెట్టారా?” ”హుఁ! ఎంతటి బ్రతుకు బ్రతికినా, ఎంతటి ఉద్యోగాలు చేసి ఊళ్ళేలినా, ఆడపిల్లను కనడంతో తండ్రులిలా దిగజారిపోతారు కాబోలు!” స్వగతంగా అన్నట్లే అన్నది శ్రీలక్ష్మి పైకి అందరికీ విన్పించేట్లుగానే. ”నేను చదువుకుంటున్నాను. త్వరలోనే డాక్టర్నై ప్రయోజకురాల్ని కాబోతున్నాను. నా నీడనే పదిమందిని బ్రతికింపజేయ గలదాననౌతున్నాను. రూపానికి లోటులేదు, గుణానికి లోటు లేదు. మరి మారని వస్తువులాగా నెత్తిన యింత సొమ్మువుంచి మరీ శనిని వదిలించుకున్నట్టు వదిలించుకో జూస్తున్నారంటే ఏమనుకోను? లేక నా నీతి నిగ్రహాలపై మీకు నమ్మకం లేదా?” చదువు, అందం, తెలివితేటలు అన్నీ వున్న యువతి శ్రీలక్ష్మి. ధనదాహం గల శ్రీపతి కుమారునితో పెళ్ళి నిశ్చయమై ‘కట్నం’ వద్ద వచ్చిన పేచీ వలన ఆత్మాభిమానంతో ఆ సంబంధం వదులుకుంది. తరువాత ఆమె జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? ఆమె జీవిత ‘భాగ్యచక్రాన్ని’ ఎలా అందిపుచ్చుకుంది. తెలియాలంటే ఆరికెపూడి(కోడూరి) కౌసల్యాదేవి కలం నుంచి వెలువడిన ‘భాగ్యచక్రం’ నవలని - తప్పక చదవండి!

Books By This Author

Book Details


Titleభాగ్యచక్రం
Writerఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి
Categoryభాషాసాహిత్యాలు
Stock Not Available
ISBN
Book IdSPI017
Pages 272
Release Date01-Mar-2014

© 2014 Emescobooks.Allrights reserved
39179
13015