--
అర్ధాంగి శబ్దము శివునికి రూఢి అని ఒక పాండితీ వైశారద్యముతో చేసిన చమత్కృతి యిది. ఒక చెంత చిలువలై ఒక చెంత కలువలై సలలితాభరణములు సందడించిన అర్ధనారీశ్వరుడు శివుడొక్కడే. ఇదే సత్యకవిగారు పై పద్యములో చూపిన చమత్కారము. ఇట్లు చెప్పినచో వందలాది పద్యములు పునరుక్తం చేయవలసి వస్తుంది. ఒక ఘట్టము చూడండి:
తినబోతూ రుచులడిగేవాడు తెలివిగలవాడుకాడు. కావ్యఫలమునకు ఇది తొడిమ మాత్రమే. తొడిమను తొలగించి ఇక ఫలాస్వాదన చేయండి. చద్దిని మించిన నంజుడు అనౌచిత్యము. పరిమితమైన పీఠికయే పరీమళహేతువు. ఈ కృతి మృత్యుంజయము. త్రికాలాబాధితము.
| Title | మృత్యుంజయుడు |
| Writer | గెడ్డాపు సత్యం |
| Category | భాషాసాహిత్యాలు |
| Stock | 100 |
| ISBN | -- |
| Book Id | EBJ024 |
| Pages | 70 |
| Release Date | 07-Feb-2010 |