మహల్లో కోకిల

Mahallo Kokila

వంశీ

Vamsi


M.R.P: రూ.70

Price: రూ.65


- +   

Publisher:  Sahithi Prachuranalu


--

About This Book


గండశిలని చేద్దామనుకుంటుంది తన హృదయాన్ని. కానీ, ప్రతిక్షణం, ప్రతి సంఘటనా ఆమెని స్పందింప జేస్తూనే వుంటాయి.
నిజం. ఆమెకి జీవితంమీద ఏమాత్రం ఆశా, తాపత్రయాలు లేవు. ఊహల ఉయ్యాళ్ళు వేసుకుని వెన్నెల పల్లకీలని నిర్మించుకోవాలనే అభిలాష ఆమెకి లేదుగాక లేదు. కానీ, దేన్నయితే కాదంటుందో, ఏదయితే చెయ్యకూడదనుకుంటుందో అదే చెయ్యాల్సిన దుస్థితి ఏర్పడ్తుంది.
చిత్రవిచిత్రాలతో నిండిన ఓ మ్యూజియం. కానీ, అందులో ఎన్నెన్నో భయానకమైన ఉదంతాలు నిండి వున్నాయ్‌. ఆ గతమే ప్రపంచానికి తెలిస్తే తనకి ఏర్పడే మానసికమైన క్షోభ ఊహాతీతం. ఆర్తితో తను విలవిల్లాడి చనిపోతుంది. అందుకే ఆ గతం తాలూకు చరిత్ర ఛాయామాత్రంగా కూడా తెలీకుండా భూగర్భంలో నిధిలా దాచేసింది.
ఆమెలో వున్న పెద్ద వీక్‌నెస్‌ మనుషులకి లొంగిపోవడం.
”కోకిలగారూ గుడ్మాణింగ్‌! ఆ మధ్య ఆ రంగణ్ణాల్‌ కలై మండ్రమ్‌లో మీ డాన్స్‌ ప్రోగ్రాం చూశాను. ఓహ్‌ అద్భుతం. నిజంగా నా జన్మ ధన్యమైందండీ!!” కంఠంనిండా అనుభూతి నింపుకుని అలా ప్రశంశించాడు అవతలి మనిషి.
”థాంక్స్‌” అందేకాని ఆ పొగడ్తలకి ఏమాత్రం పొంగిపోలేదు.
”మీకు చెప్పకుండానే ఎల్లుండి రాజాజీ హాల్లో మీ ప్రోగ్రాం ఫిక్స్‌ చేసుకున్నాం.”
”ఎల్లుండా?”
”ఔనండీ! మీతోవున్న చనువుని ఆసరాగా తీసుకుని చేసిన ఈ పనికి క్షమించాలి. మీకు తెల్సు నా బీదతనం. మీరు కరుణించాలి. లేకుంటే చాలా అవస్థలకి గురవుతాను… తప్పదు… వుంటానండీ శలవ్‌!” ఫోన్‌ పెట్టేశాడా మనిషి.
అతనికి మళ్ళీ ఫోన్‌చేసి రానని చెప్పడానికి ఆమె డైరీలో అతని ఫోన్‌ నంబరుంది కానీ చెయ్యలేదు. ఆమెకి తెల్సు అతను ప్రోగ్రామ్‌కి డబ్బివ్వడని. అయినా మాట్లాడదు. ఆమెకి తిరిగి మాట్లాడే శక్తి, కోపం లేకపోలేదు. ఆమెతో నిజంగా తిట్లు పడ్డవాడు చాలా ధన్యుడు. తిట్లు తిన్నాకా ఎంతో ఉపకారం ఆమె ద్వారా పొంది తీరుతాడు.
ఆ రకమైంది ఆమె ఆంతర్యం.

Books By This Author

Book Details


Titleమహల్లో కోకిల
Writerవంశీ
Categoryభాషాసాహిత్యాలు
Stock 100
ISBN
Book IdSPG019
Pages 248
Release Date01-Mar-2014

© 2014 Emescobooks.Allrights reserved
39179
13015