కపిలవాయి లింగమూర్తి

Kapilavayi Lingamoorthi


DOB:  31-03-1928

City:  Nagarkarnool

About Author


వీరు అచ్చంపేట తాలుకా బల్మూర్ మండలం జినుకుంట లో మాణిక్యమ్మ, వెంకటాచలం దంపతులకుమార్చి 31, 1928 కు సరియైన ప్రభవ నామ సంవత్సరం మాఘశుద్ధ నవమి నాడు జన్మించిన లింగమూర్తి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ. (తెలుగు) పట్టా పొంది 1954లో నాగర్ కర్నూల్ జాతీయోద్యమ పాఠశాలలో తెలుగు పండితునిగా చేరాడు. ఆ తర్వాత 1972 లో పాలెం శ్రీవేంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో ఉపన్యాసకుడుగా చేరి దశాబ్దం పాటు సేవలందించి 1983లో ఉద్యోగవిరమణ పొందాడు. లింగమూర్తి నడిచే విజ్ఞానసర్వస్వంగా పేరుపొందాడు.  పలుగ్రంథాలు, పరిశోధనలు రచించి సాహితీవేత్తగా పేరుపొందాడు. కపిలవాయికి తెలుగు విశ్వవిద్యాలయం 26.8.2014 న గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. 30.08.2014 రోజున విశ్వవిద్యాలయం 13 స్నాతకోత్సవంలో చాన్‌సలర్, రాష్ట్ర గవర్నర్ నరసింహన్ వీరికి గౌరవ డాక్టరేట్‌ను అందించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగు యూనివర్సిటీ నుంచి తొలి గౌరవ డాక్టరేట్ పొందిన వ్యక్తిగా కపిలవాయికి ఈ ఘనత దక్కింది. ఓయూలో ఎంఎల్(తెలుగు) అభ్యసించారు.1954 నుంచి 1983లో పదవీ విరమణ పొందే వరకు నాగర్‌కర్నూల్ లోని జాతీయోన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసి అక్కడే స్థిరపడ్డారు.అనేక స్థలచరిత్రలు, దేవాలయాల కథలకు ఆయన ప్రాణంపోశారు. మొత్తం 70 రచనలు ముద్రితమయ్యాయి. 11రచనలు ద్విముద్రితాలు, 25 రచనలు ముద్రించాల్సి ఉంది.


Books By This Author

DOB31-03-1928

© 2014 Emescobooks.Allrights reserved
36072

Warning: Use of undefined constant r - assumed 'r' (this will throw an Error in a future version of PHP) in /home/n8hps0619pr6/public_html/emescobooks.com/include/session.php on line 3697
5945