జీవించు... నేర్చుకో... అందించు...

Jivinchu - Neerchuko - Andinchu

తుమ్మేటి రఘోత్తమరెడ్డి

Tummeti Raghotham Reddy


M.R.P: రూ.250

Price: రూ.200


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


Jivinchu - Neerchuko - Andinchu

జీవించు...నేర్చుకో.... అందించు....
(ఆధునిక తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి స్వతంత్ర కొటేషన్స్)

About This Book


శరీరమాద్యం ఖలు ధర్మసాధనం’ అనే కొటేషన్‍ (సూక్తి) మా ఇంటి దూలం పక్కన చాక్‍పీసుతో రాసి ఉండటాన్ని నేను చదివాను. అప్పడు నా వయసు ఏడు సంవత్సరాలు కావచ్చు. నేను రెండో తరగతిలో ఉండి ఉండవచ్చు. రాసిన వారెవరో ఆ కొటేషన్ రచయిత పేరు రాయలేదు.
భూమిలో పడ్డ విత్తనం తీరుగా - ఆ కొటేషన్ నా మనసులోపడ్డది అర్థమయీ కానట్టు - బోధపడీ పడనట్టు. దాని అర్థం ఏమిటో పూర్తిగా తెలుసుకోవాలనే జిజ్ఞాస నాలో ప్రారంభమైంది. దాని అర్థం గురించి నేనెవరినీ అడగలేదు. వయసుపెరుగుతున్నకొద్దీ, జీవితానుభవాలు కలుగుతున్నకొద్దీ, జీవితాన్ని గమనిస్తున్నకొద్దీ ఆ కొటేషన్ రోజూ నా కేదో బోధిస్తున్నట్టుగానే ఉండేది. శరీరం - ఆరోగ్యం - తిండి - వ్యాయామం వంటి విషయాలే కాదు, శరీరానికీ, జీవితానికీ ఉండే సంబంధం ఎటువంటిదో, అటువంటి శరీరాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో, దానికోసం ఏమి చెయ్యాలో, ఏమి చెయ్యకూడదో నిత్యం నాకేదో ఎరుక పరుస్తున్నట్టుగా ఉండేది. ఆ కొటేషన్ చిన్నదేకాని, మొత్తం జీవితం పొడుగునా నన్ను చైతన్య పరుస్తూ వస్తూనే ఉంది. అది మొదలు నాకు కనిపించిన ప్రతి కొటేషన్‍నీ చదువుతూ వచ్చేవాణ్ణి. నాకు సాహిత్యం పట్ల - ఆసక్తి ఆ కొటేషన్‍తోనే ప్రారంభమైందని చెప్పాలి.

Books By This Author

Book Details


Titleజీవించు... నేర్చుకో... అందించు...
Writerతుమ్మేటి రఘోత్తమరెడ్డి
Categoryభాషాసాహిత్యాలు
Stock 100
ISBN978-93-86212-10-8
Book IdEBP057
Pages 488
Release Date14-Aug-2016

© 2014 Emescobooks.Allrights reserved
39179
13015