అశేష పాఠకలోకం కోరిక మేరకు ఎమెస్కోబుక్సు ఇప్పుడు ఎమెస్కో బుక్స్ వెబ్‌సైట్ ద్వారా కూడా లభిస్తున్నాయి.    
సత్యమొక్కటే - దర్శనాలు వేరు

Truth Called Them Differently

ఆర్‌.కె.ప్రభు

R.K.Prabhu


M.R.P: రూ.90

Price: రూ.80


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


పొరుగునుంచి తెలుగులోకి: విమర్శ, చర్చలకోసం 26
(టాగోర్‌ - గాంధీ సంవాదం)
సేకరణ, సంకలనం :- ఆర్‌.కె.ప్రభు, రవీంద్ర కేలేకర్‌
తెలుగు అనువాదం:-  వాడ్రేవు చినవీరభద్రుడు
పుస్తకమాలిక సంపాదకులు: అడ్లూరు రఘురామరాజు
సంపాదకులు : దుర్గెంపూడి చంద్రశేఖర రెడ్డి

About This Book


టాగోర్‌ని జాతి ఒక కవివరుడిగా, గురుదేవుడిగా గుర్తుపెట్టుకుంటుంది. గాంధీజీని ఒక కర్మవీరుడిగా, మహాత్ముడిగా అంగీకరించింది. ఆ కవీంద్రునికీ, ఆ కర్మవీరుడికీ మధ్య ఒక ఉమ్మడిధ్యేయానికీ, సౌభ్రాతృత్వానికీ సంబంధించిన మహత్తరఆధ్యాత్మికబంధం స్థిరపడింది. వారు గొప్ప మిత్రులు. ఒకరినొకరు దాదాపు ప్రేమికుల్లాగా ఆరాధించుకున్నారు. కానీ వారి వ్యక్తిత్వ లక్షణాలు వేరువేరు. వారి జీవితసాధన కూడా వేరువేరు. భారతప్రజానీకాన్నీ వారు వేరువేరు పద్ధతులతో ఆకర్షించారు, ప్రభావితం చేశారు. ఒకరకంగా చెప్పాలంటే వారు ప్రతి ఒక్క విషయంలోనూ భిన్నధ్రువాలు. కానీ వారి ఆత్మ ఒక్కటే. వారికి తమదైన విభిన్న మార్గాల్లోనే తాము నడవవలసి ఉంటుందని తెలుసు. కానీ తమతమ మార్గాలు పరస్పరపూరకాలేననీ, తమ దారులు వేరైనా ఆత్మలొక్కటేననీ వారికి తెలుసు. వారి మధ్య జరిగిన సంవాదాన్ని ప్రపంచం మరింత విస్తృతస్థాయిలో అర్థం చేసుకుంటే బాగుంటుంది. కవీశ్వరుడు అన్నిటికన్నా ముందు చింతనాపరుడైన మానవుడనీ, గాంధీజీ కర్మయోగి అనీ మనం గుర్తు పెట్టుకోవాలి. ఆ ఇద్దరూ తమకాలంనాటి భారతీయసమాజాన్ని తమదైన పద్ధతిలో తమదైన క్షేత్రంలో ప్రభావితం చేసి ఉండడం నిజంగానే అద్భుతమైన విషయం. వారిద్దరి మధ్యా ఎటువంటి విభేదంగానీ, సైద్ధాంతికంగా భిన్నదృక్పథాలుకానీ లేవనీ వారి మధ్య నడిచిందంతా వారివారి దృక్కోణాల ప్రాధాన్యాల్ని నొక్కి చెప్పటంలో తలెత్తిన పొరపొచ్చాలుమాత్రమేనని మనకి తెలుసు. మహాత్ముడి చేతుల్లో భారతదేశం సురక్షితంగా ఉండగలదన్న విశ్వాసాన్ని టాగోర్‌ ప్రకటించటంతో ఈ వివాదం ముగిసిపోయింది.                                                                             -కాకా కాలేల్కర్‌

Books By This Author

Book Details


Titleసత్యమొక్కటే - దర్శనాలు వేరు
Writerఆర్‌.కె.ప్రభు
Categoryఅనువాదాలు
Stock 100
ISBN978-93-85231-58-2
Book IdEBO035
Pages 152
Release Date02-Feb-2015

© 2014 Emescobooks.Allrights reserved
37613
8395