--
సురేష్ పద్మనాభన్ చక్కని వక్త, రచయిత, జీవిత శిక్షకుడు, అనుభవం గల సలహాదారు. మనీవర్క్ షాప్ తో పాటు ఆశ్చర్యం కలిగించే ‘‘సంకల్పసిద్ధి, ఏన్షియెంట్ సీక్రెట్స్ ఆఫ్ మనీ లేదా ఆఫ్ లైఫ్’’ వంటి వర్క్ షాప్ లకూ ఆయనే స్థాపకుడు.
‘ఐ లవ్ మనీ, ఆన్ క్లౌడ్ 9, ఏన్షియెంట్ సీక్రెట్స్ ఆఫ్ మనీ’ పుస్తకాల రచయిత. ‘ఐ లవ్ మనీ’ పుస్తకం 11 భారతీయ, విదేశీయ భాషలలోనికి అనువదితమై విపరీతంగా అమ్ముడుపోతూ అంతర్జాతీయంగా పేరు సంపాదించింది.
‘ఓన్లీ ప్స్రాఫిట్స్’ అనే మరో పుస్తకం – స్టాక్ మార్కెట్, పెట్టుబడుల ద్వారా ధనాన్నెలా సంపాదించవచ్చు అనే విషయం మీద సంపూర్ణ అవగాహాన కల్పిస్తూ – రాబోతున్నది.
భారతీయుడుగా పుట్టినందుకు ఆయన గర్విస్తారు. భారతదేశ ఘనచరిత్రను, సంస్కృతిని ప్రపంచం గుర్తించి గౌరవించాలనేది ఆయన ఆశయం. లక్షలాది జనాన్ని కలిసి ముఖ్యంగా ధనం, జీవితం, ఆధ్యాత్మికతల విషయంలో వారి చైతన్య స్థాయిని పెంచడం ఆయన లక్ష్యం.
| Title | ఐ లవ్ మనీ |
| Writer | సురేష్ పద్మనాభన్ |
| Category | ఇతరములు |
| Stock | Not Available |
| ISBN | 978-93-82203-72-8 |
| Book Id | EBM029 |
| Pages | 224 |
| Release Date | 24-Jan-2013 |