అగ్నితీర్థం, శీల పరీక్ష

Agniteertham, Seelapariksha

డా. కాకాని చక్రపాణి

Dr. Kakani Chakrapani



రూ. 200


- +   

Publisher:  Emesco Books


కాకాని చక్రపాణి నవలలు/ నవలికలు; సంపుటం-6
అగ్నితీర్థం, శీల పరీక్ష

About This Book


అగ్నితీర్థం
భర్త, స్త్రీలోలుడయిన అతడి లాయర్‌ స్నేహితుడి కుట్రకు బలయి, ముంబై వేశ్యావాటికలో కొంతకాలం
దుర్భరజీవితం గడిపి వచ్చిన చారులత, భర్తకూ, అతడి స్నేహితుడికీ ఎలా గుణపాఠం నేర్పిందో, వారిపై
ఎలా పగ తీర్చుకుందో ఆసక్తిగా కళ్ళకు కట్టించారు. మూల కథాంశం ఇదే అయినా, కథలో ఆసక్తిగా
చదివించే మలుపులనేకం ఉన్నాయి. మంచినీళ్ళలా డబ్బు గుమ్మరించగల స్తోమత చారులతకు
ఎక్కడిది?- అనే సందేహం ఓ దశలో పాఠకుడికి కలుగుతుంది. వ్యభిచారవృత్తి ద్వారా అంతగా
సంపన్నురాలవటం సాధ్యమా?-అనే ప్రశ్న తలెత్తుతుంది. దానికి సంతృప్తికరమైన మలుపును ఇచ్చి
పాఠకుడి సందేహాన్ని తీర్చారు.
శీల పరీక్ష
అనసూయమ్మ తన స్నేహితురాలైన మరియమ్మ మరణానంతరం, ఆమె కూతురు రేణుకను పెంచుతుంది.
రేణుకకి 'శీల పరీక్ష' పేరుతో అన్యాయం జరుగుతుంటే, రేణుక భర్తకీ, ఊరిపెద్దలకూ, స్వార్థపరులకూ ఏ
విధంగా గుణపాఠం నేర్పటానికి అనసూయమ్మ ప్రయత్నించిందో, అత్యంత ఉత్కంఠభరితంగా
చిత్రించారు రచయిత.

Books By This Author

Book Details


Titleఅగ్నితీర్థం, శీల పరీక్ష
Writerడా. కాకాని చక్రపాణి
Categoryభాషాసాహిత్యాలు
Stock 100
ISBN978-93-83652-02-0
Book IdEBN016
Pages 400
Release Date02-Jun-2014

© 2014 Emescobooks.Allrights reserved
36498

Warning: Use of undefined constant r - assumed 'r' (this will throw an Error in a future version of PHP) in /home/n8hps0619pr6/public_html/emescobooks.com/include/session.php on line 3697
6843