చిత్రం భళారే విచిత్రం

Chitrtam Bhalare Vichitram

మల్లిక్

Mallik


M.R.P: రూ.60

Price: రూ.54


- +   

Publisher:  Sahithi Prachuranalu


--

About This Book


”హల్లో !……..హౌవ్వార్యూ?!

ఇప్పటిదాకా బాగానే ఉండి ఉంటారు. ఎందుకంటే ఇంకా ఈ నవల చదవడం మొదలుపెట్టలేదు కనుక!

మేం కష్టపడి నవల్రాస్తే (మూడు నెలలో ఆరునెలలో కూర్చుని) ”ఎబ్బే…..ఏం బావుందీ” అంటూ మీరు చప్పరించేస్తారు. అదే సినిమా అయితేనో!…….

”అబ్బో…..చాలా బాగుంది”

”హమ్మో బాగుంది -”

”వారెవ్వా……కథ సూపర్‌గా ఉంది. సినిమా హిట్టే! కనీసం వందరోజులు గ్యారంటీ” అంటారు.

ఇవేమీ కాకపోయినా కనీసం ”ఆ సినిమానా? ఫరవాలేదు… చూడొచ్చు” అనైనా అంటారు.

మీకు ఇంతగా నచ్చిన సినిమాల్లో ఏముంటుందీ? చిన్నప్పటినుండీ మీరు చూస్తున్న సీన్లే ఉంటాయి. సినిమానిండా…… ఇప్పటికీ కొన్ని వందల సార్లు ఆ సీనులు చూసి ఉంటారు. సినిమా చూస్తున్నప్పుడు ముందువచ్చే సీనులూ, డైలాగులు కూడా మీరు చెప్పేయగలుగుతారు.

అయినా మీకు ఆ సినిమాలే నచ్చుతాయ్‌.

యామై రైట్‌ ?!

రైట్‌ !!

అందుకే నేను ఏదో రాసి రిస్క్‌ తీసుకోదలుచుకోలేదు. మీకు అన్ని విధాలా నచ్చే ఆ సినిమా టైపు కథనే మీకు చెప్పి, మీ మనసుల్ని రంజింప చెయ్యాలని బంగారందో, ఇత్తడిదో, ఏదో ఒక కంకణం కట్టుకున్నాను.

మరి రెడీగా ఉన్నారా? కథ చెప్తాను ? ?

రెడీ…..

Books By This Author

Book Details


Titleచిత్రం భళారే విచిత్రం
Writerమల్లిక్
Categoryభాషాసాహిత్యాలు
Stock 99
ISBN
Book IdSPI013
Pages 192
Release Date01-Mar-2014

© 2014 Emescobooks.Allrights reserved
36348
4914